OPPO Reno13: కొత్త రంగుతో.. అదిరిపోయే ప్రీమియం లుక్.! 20 d ago

OPPO ఫోన్లు సాధారణంగా చాలా మంచి ఫీచర్లతో వస్తాయి. కెమెరా విషయానికి వస్తే Oppo మొబైల్ ను ఢీ-కొట్టే బ్రాండ్ ఇంకోటి లేదు. OPPO ఫోన్‌లో AI ఫీచర్లు అందమైన ఫోటోలు, వీడియోలు అందిస్తాయి. Oppo కంపెనీ OPPO Reno13 సిరీస్‌ను జనవరి 9న అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక సాంకేతికత.. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో మార్కెట్ లో సూపర్ హిట్ అయ్యింది. అయితే తాజాగా ఈ ఫోన్ కొత్త వేరియంట్.. కొత్త రంగుతో మార్చ్ 20న వస్తుంది. ఫీచర్లలో ఏ మార్పు లేకుండా.. కేవలం కలర్ వేరియెంట్ నే మారుస్తున్నామని కంపెనీ తెలిపింది. ఒకసారి Oppo Reno 13 ఫీచర్లు గురించి తెలుసుకుందాం రండి!
Oppo Reno 13 ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.59 అంగుళాలు AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 120 Hz
ప్రాసెసర్: MediaTek Dimensity 8350
పీక్ బ్రైట్‌నెస్: 1200 nits
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, ColorOS
బరువు: 181 గ్రాములు
బ్యాటరీ: 5600 mAh
ఛార్జింగ్: 80W సూపర్ VOOC ఛార్జింగ్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
- 2 MP మోనో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 50 MP
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
కలర్ ఆప్షన్స్:
- ఐవరీ వైట్
- లుమినస్ బ్లూ
- స్కై బ్లూ (కొత్త ఆప్షన్)
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G డ్యూయల్ సిమ్
- Wi-Fi 6E
- బ్లూటూత్ 5.4
- USB టైప్-C
సెన్సార్లు: ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్
ఫోన్ ధరలు:
అమెజాన్:
- 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ. 30,805
- 8GB RAM, 256GB స్టోరేజ్-- రూ. 31,400
ఫ్లిప్‌కార్ట్:
- 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ. 37,999
- 8GB RAM, 256GB స్టోరేజ్-- రూ. 39,999
ప్లస్ పాయింట్స్:
- సూపర్ గేమింగ్ సపోర్ట్
- నీళ్లు, దుమ్ము పడినా ఫోన్ పాడవదు
- ఉపయోగకరమైన AI ఫీచర్లు
మైనస్ పాయింట్స్:
- అన్ని చోట్ల ఇది అందుబాటులో లేదు
- కొంచం ధర ఎక్కువగా ఉంది
- ప్రీమియం లుక్ లేదు
చూసారుగా OPPO Reno13 ఫీచర్లు ఎంత బాగున్నాయో. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఫోటోగ్రఫీ ప్రియులకు ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ప్రీమియం లుక్ కోసం Oppo.. స్కై బ్లూ వేరియంట్ ను విడుదల చేసారు. కెమెరాతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్.. వేగవంతమైన ఛార్జింగ్ లు కూడా ఈ ఫోన్ ప్రత్యేకతలు. Oppo Reno సిరీస్‌లోని ఈ కొత్త రంగు వేరియంట్ త్వరలో మీ దగ్గరలోని Oppo స్టోర్లలో మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ లో కన్నా అమెజాన్ లో కాస్త తక్కువ ధరకే లభించవచ్చు.
ఇది చదవండి: 6.5 గంటల పాటు నాన్-స్టాప్ అల్ట్రా-స్మూత్ గేమింగ్.. అదికూడా కేవలం సింగిల్ ఛార్జ్‌కే..!